విజయవంత మైన ప్రేరణ జాబ్ మేళా
న్యూస్‌తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, రంపచోడవరం ఓ ఎస్ డి జగదీష్ అడహల్లి, చింతూరు సబ్ డివిజన్ ఏఎస్పీ పంకజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎర్రంపేట ఏపీ ఆర్ స్కూలు ప్రాంగణమునందు ప్రేరణ( జాబ్ మేళా ) ప్రోగ్రాం చింతూరు సబ్ డివిజన్ పోలీసు డిపార్ట్మెంట్ నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది . ఈ జాబ్ మేళా నందు ఎన్నో సోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ ఉన్నికృష్ణన్ మరియు హెచ్ఆర్ ప్రవీణ్ కుమార్, వారి సిబ్బందితో హాజరై, వివిధ కంపెనీలకు ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ నిర్వహించగా చింతూరు సబ్ డివిజన్ వివిధ గ్రామాల నుండి అభ్యర్థులు సుమారు 105 మంది హాజరవడం జరిగింది. మారుమూల గ్రామాల నుండి ప్రభుత్వ స్కూల్స్,కాలేజీ నందు చదువుకుని, అవగాహనలేమి, సరైన మార్గదర్శకత్వం లోపించుటవలన ,నిరుద్యోగిగా ఉండరాదని, అలాంటి వారికి పోలీస్ తరఫున మార్గదర్శకం కలిగించి ,గ్రామీణ ప్రాంత విద్యావంతులను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ప్రేరణ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు సిఐ చింతూరు టి దుర్గాప్రసాద్ , సిఐ ఎటపాక ఎం కన్నప్ప రాజు, ఎస్ఐ చింతూరు పి. రమేష్, ఎస్సై మోతుగూడెం కే. శివ నారాయణ, పోలీస్ సిబ్బంది హాజరైనారు. ఈ ప్రోగ్రాం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసినారు. (Story : విజయవంత మైన ప్రేరణ జాబ్ మేళా)