ఇన్ఫార్మర్ ల నెపం తో ఇద్దర్ని హత్య
న్యూస్‌తెలుగు/చింతూరు : పోలీస్ ఇన్ ఫార్మర్ ల నెపం తో ఇద్దరు గిరిజనులను సోమవారం అర్ధ రాత్రి మావోయిస్టులు హత్య గావించారు. చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా లోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగిచేరు గ్రామంలో కారం రాజు, మడివి మున్నా అనే వారిని గ్రామ సమీపంలో హత్య చేసి రోడ్డు పై పడేసారు.ఇన్ఫర్మర్ గా వ్యవహారించే వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. (Story : ఇన్ఫార్మర్ ల నెపం తో ఇద్దర్ని హత్య)