ఉచిత ఎల్ఈడి టీవీ ట్రైనింగ్
న్యూస్ తెలుగు / వినుకొండ :వినుకొండ నియోజకవర్గం లో టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సెక్రటరీ చిన్న కార్యవర్గం ఆధ్వర్యంలో ఉచిత ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ స్థానిక సిపిఐ ఆఫీస్ లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, దద్దాల ఆంజనేయులు ట్రైనర్స్ గా ఎల్ఈడి టీవీ లో మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీ లేటెస్ట్ టెక్నాలజీ గురించి మెలుకువలు ఉదయం నుండి సాయంత్రం వరకు వివరించారు.. మారుతున్న టెక్నాలజీ నీ అందుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది టీవీ మెకానిక్ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని , ప్రతి ఇంట్లో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో టీవీ లు వాడుతున్నారు. కానీ టీవీ మెకానిక్ అనే వారిని ప్రభుత్వం చేతి వృత్తి దారులు గా గుర్తించలేదు అని ప్రభుత్వ పధకాలు మమ్మల్ని గుర్తించి మాకు కూడా అందించాలని పల్నాడు జిల్లా అధ్యక్షులు దద్దాల ఆంజనేయులు కోరారు.(Story : ఉచిత ఎల్ఈడి టీవీ ట్రైనింగ్)