గ్రామాలలో సైతం బిజెపిని అభివృద్ధి చేయడమే లక్ష్యం
అధ్యక్ష పదవి అలంకరణ కాదు
బిజెపి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ
న్యూస్ తెలుగు/విజయనగరం : గ్రామాలలో సైతం భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడమే లక్ష్యం అనిఅధ్యక్ష పదవి అనేది అలంకరణ కాదు ఒక బాధ్యత అని విజయనగరం జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రస్తుత ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు , బిజెపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు చేతుల మీదుగా బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రాజేష్ వర్మ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ను కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తానన్నారు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ నాకు సోదరుడు సమానుడైన రాజేష్ వర్మ అధ్యక్షులుగా నియమితులు కావడం ఎంతో ఆనందమన్నారు సమర్థత ఉన్న నాయకుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 36 రకాల అంతులేని జబ్బులకు కష్టం సుఖాలు తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి పైడి వేణుగోపాల్, జిల్లా మాజీ అధ్యక్షులు శివారెడ్డి, శ్రీధర్, సుధీర్, అప్పారావు, లక్ష్మీనారాయణ, రాజేష్, దుర్గాప్రసాద్ జిల్లాస్థాయి నాయకులందరూ పాల్గొన్నారు.(Story : గ్రామాలలో సైతం బిజెపిని అభివృద్ధి చేయడమే లక్ష్యం )