భూముల రేట్లు పెంపు అసంభద్ధం
-20శాతం లోపే అనిచెప్పి 340 రేట్లు ఎందుకు పెంచారు…?
-సామాన్య ప్రజలపై పెనుభారం
పెరిగిన రేట్లు తగ్గించాలి : దస్తావేజు లేఖర్లు డిమాండ్
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరల పెంపు అసంబద్ధం గా ఉందని వినుకొండ దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపులో భాగంగా ఫిబ్రవరి 1 నుండి నూతనంగా అమలులోకి వచ్చిన భూముల ధరలు భారీగా పెంచారాని నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రీజస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని మాట్లాడుతూ రేట్లు పెంపు 20 శాతానికి మించదని చెప్పారని, వినుకొండ నియోజకవర్గం లో 340 శాతం పెంచారాని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలకు రేట్లు పెంపు 150 శాతం మేర పెరగటం వలన కాక్షిదారులు, కొనుగోలు దారులపై పెను ప్రభావం చూపుతుందన్నారు. వినుకొండ పట్టణంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోను భారీగా రేట్లు పెంపు జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో విచారించకుండా, దస్తావేజు లేఖర్లను, ప్రజలను సంప్రదించకుండా ఇష్టాను సారం ధరలు పెంపు వళ్ల నష్టం జరుగుతుందని,. వెంటనే పెంచిన రేట్లు తగ్గించాలని, భారీగా పెంచిన చోట్ల పున సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినుకొండ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కరీముల్లా ఖాన్ ని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షులు గుర్నాదం, సెక్రటరీ సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరీ హనుమంతరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వలి, కోశాధికారి ఆచారి, మెంబర్ పగడాల బాల, మరియు సభ్యులు పాల్గొన్నారు.(Story : భూముల రేట్లు పెంపు అసంభద్ధం )