బాధిత నాలుగు కుటుంబాలకు జెకె సిటీ చైర్మన్ జమాల్ ఖాన్ 12వేలు ఆర్థిక సాయం
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలంలోని సర్వేల గ్రామానికి చెందిన ముర్ర o రాజయ్య, ముర్రం బుచ్చయ్య, మడకం భద్రయ్య, మడకం సుబ్బయ్య కుటుంబాలకు చెందిన నలుగురు గిరిజనులు మృతి చెందడంతో కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ కు విషయాన్ని తెలిపారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కుటుంబ యజమానులు మృతి చెందటం పట్ల ఆయన సానుభూతిని వ్యక్తం చేస్తూ శుక్రవారం ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున 12 వేల రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జమాల్ ఖాన్ మాట్లాడుతూ కుటుంబ యజమాని మృతి ఎంతో బాధాకరమైందని చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గిరిజనుల్లో ఇటువంటి అకాల మరణాలు ఎంతో బాధాకరమన్నారు. బయట కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని చెబుతూ వారి పిల్లలకు విద్యాపరంగా ఎటువంటి అవసరం ఉన్న తాను ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముత్యాల శ్రీరామ్, పి సాల్మన్ రాజు, జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు ఎస్ కె రియాజ్, నటరాజ్, జాన్ ప్రకాష్ జాన్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.(Story : బాధిత నాలుగు కుటుంబాలకు జెకె సిటీ చైర్మన్ జమాల్ ఖాన్ 12వేలు ఆర్థిక సాయం )