నాస్తికం’ఒకశాస్త్రీయ ఆలోచన విధానం
న్యూస్ తెలుగు/వనపర్తి : నాసికం అంటే ఒక శాస్త్రీయ ఆలోచన విధానం అని నాస్తిక సమాజం జిల్లా కార్యదర్శి భాస్కర్ అన్నారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఫిబ్రవరి 8 9 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనున్న 33వ జాతీయ నాస్తికమేళా కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. నాసిక ఉద్యమం అంటే కేవలం దైవభావాన్ని తిరస్కరించడమే కాదన్నారు. పరిశోధనాత్మకంగా నిరూపితమైన శాస్త్రవిజ్ఞానాన్ని నమ్మటమే అన్నారు. అది మనిషి పురోగమనానికి దోహదం చేస్తుందన్నారు. అమానవీయమైన సామాజిక వ్యవస్థ స్థానంలో సమసమాజ నిర్మాణంలో పాలు పంచుకుంటుందన్నారు. నాస్తికమంటే ప్రశ్న అని, ప్రశ్న ఆధారంగానే సమాజ ప్రగతి, పురోగమనం వైపు సాగుతోందన్నారు. ప్రశ్నించిన సార్వాకులను సనాతనం శిక్షించింది అన్నారు. ఐదవ శతాబ్దంతో సనాతనం ప్రశ్నించినతత్వవేత్త సోక్రటీస్ కు విషమిచ్చి చంపిందన్నారు. 16వ శతాబ్దంలో సోనీ బ్రూసోను తగలబెట్టి చంపిందన్నారు. తాజాగా ప్రశ్నిస్తున్నారని కారణంతో స్టాన్ స్వామి, జె.ఎన్ సాయిబాబా మరణాలకు పాలకులు కారణమయ్యారన్నారు. పాసిస్తూ ధోరణి ప్రదర్శిస్తున్న పాలకులను ప్రశ్నిస్తూ బావ వికాస ఉద్యమంలో భాగంగా జరుగుతున్న 33వ జాతీయ నాస్తికమేళాకు వనపర్తి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయ రాములు, పట్టణ కార్యదర్శి రమేష్, నాయకులు శ్రీరామ్, అబ్రహం గోపాలకృష్ణ ,శ్రీహరి ,సీఎన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.(Story : నాస్తికం’ఒకశాస్త్రీయ ఆలోచన విధానం )