కమిటీల పేరుతో కాలనీలో మోసాలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : టీచర్స్ కాలనీలో ప్రజల (కాలని) స్థలాలను కమిటీ పేరుతో చవకగా అమ్మకాలు. లోలోపల లక్షల రూపాయలను మింగిన కొందరు పెద్దలు? వెంటనే వాటి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ప్రజలకు ఆ స్థలాన్ని అప్పగించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది.
టీచర్స్ కాలనీలో ఒక మంచి ఉద్దేశంతో నెలకల్పిన కమిటీని కొద్ది కాలం మంచిగా నడిపారని, దాని ఉద్దేశాన్ని గతంలో ఉన్న కమిటీ నాయకులు ముందుకు తీసుకెళ్లారని, వారు కాలనీ అవసరానికి కొన్ని ప్లాట్లు ఉంచుకున్నారని, అవి కాలనీకి ఆస్తిగా మారావని, కానీ 15 సంవత్సరాలుగా ఒక వ్యక్తి తానే కమిటీ పెద్దగా ఉండి అక్రమాలు చేస్తున్నాడని, కమిటీ రెన్యువల్ చేయలేదని అక్కడ ప్రజలు తెలిపారు. ఎలక్షన్ వస్తే ఎవరికి తెలియకుండా రాజకీయ నాయకులు తో ప్యాకేజీలను తీసుకోవడమే కాకుండా, 201 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని, ఇతను కొందరి వైట్ కాలర్ పెద్దలను వెంటేసుకుని పలు అక్రమాలు చేస్తున్నాడని, టీచర్స్ కాలనీ ప్రజలు ఐక్యవేదికకు విన్నవించుకున్నారు. కాలనీలో అసంపూర్తిగా ఉన్న కమిటీ హల్ కు ,ఎమ్మెల్యే, ఎంపీ నిధుల ద్వారా బాగు చేయించుకుంటామని కాలనీవాసులు తెలిపారు. ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి , జిల్లా కలెక్టర్ వీటిపై చర్య తీసుకుని ప్రజల ఆస్తులు కాపాడాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ సతీష్ యాదవ్, కాలనీ పెద్దలు యోగనంద రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగోల్ల శంకర్, మోహన్ గౌడ్, బొడ్డుపల్లి సతీష్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story : కమిటీల పేరుతో కాలనీలో మోసాలు)