శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి
సిరిమాను ఉత్సవాలు
న్యూస్ తెలుగు/ సాలూరు : ఉత్తరాంధ్ర ఇలవేల్పైన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి సిరిమాను ఉత్సవాలు. పార్వతీపురం మన్యం జిల్లా శంబర గ్రామంలో మంగళవారం ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి. ఉదయం నాలుగు గంటల నుంచి సాలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యూ లైన్ లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అమ్మవారి ఘటాల ఊరేగింపు చేస్తుండగానే పూజారి సిరిమనుతో ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమం చూడడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి దంపతులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఎలక్ట్రికల్, సిబ్బంది పాల్గొని ఎటువంటి అవాంతరాలు రాకుండా ఏర్పాటు చేశారు. (Story : శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి సిరిమాను ఉత్సవాలు)