పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో పనిచేస్తున్న హాస్పిటల్ వర్కర్స్ కు గత ఆరు నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని. వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఘనపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కార్మికులతో కలిసి వారు మాట్లాడుతూ.. హాస్పటల్లో పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని. అవి కూడా నెలనెలకు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలను పోషించడంలో భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలనెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని. పీఎఫ్ ఈఎస్ఐ అమలులో గందరగోళం నెలకొందని ఈఎస్ఐ గుర్తింపు కార్డులు కార్మికులకు అందజేయాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి.మెరుపు సమ్మెకు పిలుపునిస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో
తెలంగాణ మెడికల్ & కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు. భాస్కర్. సాయి కృష్ణ. భీమ్ రాజ్. వెంకటేష్.రంగమ్మ ప్రియాంక. పద్మ.సంగీత తదితరులు పాల్గొన్నారు. (Story : పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలి)