పోలీసులు విధుల్లో నిర్వహిస్తున్న వాహనాలకు కొత్త టైర్లు, బ్యాటరీలు అందజేసిన చేసిన జిల్లా ఎస్పీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తి పోలీసు ఎం.టి. విభాగం. రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఏ, శ్రీనివాస్ (పి టి ఓ) పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ విభాగం నుండి వచ్చిన స్పేర్ పార్ట్లు, టైర్లు, మరియు బ్యాటరీలు,పోలీసు వాహనాలకు (ఫోర్ వీలర్ మరియు టు వీలర్) వాహనాలకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.పోలీస్ శాఖ గౌరవం మీ చేతుల్లో ఉందనే విషయం గుర్తుంచుకుని, క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తూ వాహనాల నిర్వహణ సక్రమంగా చేయాలని సూచించారు.
అతి వేగంతో వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ వాహనాన్ని తమ స్వంత వాహనం లాగా చూసుకుంటూ శుభ్రంగా పోలీసుశాఖ క్రమశిక్షణ ప్రతిబింబించేలా చూడాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లే సమయంలో, ఎస్కార్ట్, నేర పరిశోధన ప్రాంతాలకు, వెళ్లే సమయంలోనూ వాహన సామర్ధ్యానికి అనుగుణంగా వాహనాలను నడపాలని, నిర్దేశించిన వేగం మించకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
వాహనాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, వాహనంలోపల, బయట శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, వేగ పరిమితి, ఇతర నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. హైవేల మీద ప్రయాణం చేసే సమయంలో వేగనియమాలు విధిగా పాటించాలని, వాహనాల ఇంజన్ ఆయిల్, బ్రేక్, క్లచ్ అయిల్స్, కూలెంట్ అయిల్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సమయానికి అనుగుణంగా ఆయిల్ మార్పు చేసుకుంటూ టైర్లలో గాలి సక్రమంగా ఉండేలా చూడాలని, స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించి వాహనాల జీవితకాలాన్ని పెంచేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి,వెంకటేశ్వరరావు , డిసిఆర్బి డిఎస్పి, ఉమా మహేశ్వరరావు , వనపర్తి సిఐ, క్రిష్ణ, కొత్తకోట సీఐ. రాంబాబు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు ఎం.టి. విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(Story : పోలీసులు విధుల్లో నిర్వహిస్తున్న వాహనాలకు కొత్త టైర్లు, బ్యాటరీలు అందజేసిన చేసిన జిల్లా ఎస్పీ)