పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో హత్య
న్యూస్ తెలుగు/చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేసముడి గ్రామంలో సోడి భద్రు (41) అనే గిరిజనుడుని ఆదివారం రాత్రి గొడ్డలితో కొట్టి మావోయిస్టులు హత్య చేశారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని, అందుకే తాము శిక్ష విధించామని, భైరంగడ్ ఏరియా కమిటీ పేరుతో సంఘటన స్థలంలో విడిచారు. పోలీసులుఇన్ ఫార్మర్ గా ఎవరు వ్యవహరించినా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.భైరంగడ్ పోలీస్ లు మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.