సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం, ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన శివయ్య భవన్, ఏఐటీయూసీ ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ పల్నాడు జిల్లా నాయకులు ఏ.మారుతి వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. నేడు మున్సిపాలిటీలో పని చేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడవటం ఇబ్బందులుగా మారడంతో పిల్లల్ని చదివించాలన్న, ఫీజులు కట్టలేని భారాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఫైనాన్స్ లో అప్పులు తీసుకొచ్చి వడ్డీలపై వడ్డీలు కడుతూ కుటుంబాల్ని పోషించటం చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అది అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెంది వెంటనే ప్రభుత్వాలు స్పందించి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాటర్ వర్కర్స్, కరెంట్ వర్కర్స్, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సండ్రపాటి సైదా, బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, రాయభారం వందనం, కోపరపు మల్లికార్జున, అధిక సంఖ్యలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి గౌరవ అధ్యక్షులుగా బూదాల శ్రీనివాసరావు అధ్యక్షులుగా, ఎం. శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా, షేక్ నాగూర్ ఉపాధ్యక్షులుగా, పెద్దింటి స్వామి సహాయ కార్యదర్శిగా, మురికిపూడి నాసరయ్య, తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగరాజు, డిసెంబరం, ఖాజా, రాముడు, బొమ్మి నాగరాజు, గాలయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి )