ఘనంగా గణతంత్ర దినోత్సవం
న్యూస్ తెలుగు/చింతూరు : రిపబ్లిక్ డే పురస్కరించుకొని చింతూరులోని సమీకృత గిరిజన అభివృద్ది సంస్ద ప్రాజెక్ట్ ఆఫీసర్, అపూర్వ భరత్, ఉదయం కార్యాలయ ఆవరణంలో జెండా ఆవిష్కరణ చేసి యున్నారు. అనంతరం కార్యాలయ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాన్నారు. తర్వాత గురుకుల పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేసారు.జి.సి.సి., వెలుగు, ఐ.సి.డి.ఎస్., విద్య, హెల్త్, స్టాల్ల్ ను ప్రారంబించారు. అనంతరం వివిద పాఠశాలల విద్యార్దులు మార్చ్ పాస్ట్ వందనం స్వీక రించారు . ఐటిడిఏ లో జరుగు వివిధ అభివృద్ది కార్యక్రమములైన ఆర్.ఓ.ఎఫ్.ఆర్, వైద్య, ఆరోగ్యం, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, రూరల్ వాటర్ సప్లయ్, శానిటేషన్, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటి, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, హౌసింగ్, స్పెషల్ మైనర్ ఇరిగేషన్, రోడ్లు భవనములు, ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్, వెలుగు, జి.సి.సి., వ్యవసాయం, హార్టికల్చర్, ట్రైకార్ అభివృద్ది కార్యక్రమముల పై ప్రసంగించా రు. వివిధ పాఠశాలల వారు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్ లను తిలకించడం జరిగినది. మార్చ్ పాస్ట్, కల్చరల్ ప్రోగ్రామ్ లలో పాల్గొనిన విద్యార్దిని, విద్యార్డులకు మొదటి, రెండవ,మూడవ బహుమతులను అందజేశారు . చివరగా చింతూరు డివిజన్ పరిధిలో పనిచేయు చున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రములు 185 మందికి అందజేశారు . ఈ కార్యక్రమములో ఏ.ఎస్.పి. పంకజ్ కుమార్ మీనా, నాలుగు మండలాల, ఎమ్మార్వోలు ఎండివోలు,ప్రజా ప్రతినిదులు, వివిద శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.(Story : ఘనంగా గణతంత్ర దినోత్సవం )