సాలూరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/ సాలూరు:సాలూరు పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. సాలూరు తహసిల్దార్ రామమూర్తి మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం దేశ ప్రజలందరూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం. రాజ్యాంగాన్ని అమలపరచడంతో. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా శుభ పరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం జెండాని ఆయన ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ సిహెచ్ వెంకట్రావు జెండాను ఆవిష్కరించారు. సాలూరు టౌన్ సర్కిల్ ఆఫీసులో సిఐ అప్పలనాయుడు. రూరల్ సర్కిల్ ఆఫీసులో సిఐ రామకృష్ణ ఎంపీడీవో ఆఫీసులో ఇన్చార్జి ఎంపీడీవో పార్వతి. మువ్వన్నెల జెండాలనుఆవిష్కరించారు.అదేవిధంగా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో. జూనియర్ కళాశాల ఆవరణంలో మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు జెండాలను ఆవిష్కరించారు. (Story : సాలూరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు)