రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి స్వాగతం
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా న్యాయమూర్తులతో అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి కి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వాగతం పలికారు. శనివారం వనపర్తి జిల్లా న్యాయమూర్తులతో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వనపర్తి జిల్లాకు రావడంతో కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం ఐ.డి. ఓ.సి ప్రాంగణంలో స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జిల్లా కోర్టు సమావేశ మందిరంలో న్యాయమూర్తులతో సమావేశంలో పాల్గొన్నారు.(Story : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి స్వాగతం)