మహిళా సమస్యల సాధన కోసం
కృషి చేయాలి: పిడి ఉమాదేవి
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో మహిళల సమస్యల సాధన కోసం కృషి చేయాలని డిఆర్డిఏ పిడి ఉమాదేవి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి డి ఆర్ డి ఏ కార్యాలయంలో భారతీయ మహిళా సమాఖ్య 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలివివాహాల నిర్మూలన, మహిళల సంక్షేమం అభివృద్ధికి పలు పథకాల ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగస్వాములు కావాలన్నారు. మహిళల అణచివేతకు వ్యతిరేకంగా వారి హక్కుల రక్షణకై పోరాడాలన్నారు. మహిళలను గ్రామ ప్రాంతాల్లో చైతన్యవంతులను చేయాలన్నారు. మహిళల పురోగతికి ప్రభుత్వం పక్షాన తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు పి కళావతమ్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కృష్ణవేణి, గీత, వనపర్తి పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు భూమిక, శిరీష నాయకులు శ్రీదేవి, జ్యోతి, పద్మ, తాటిపాములదేవమ్మ, నీలమ్మ, సీపులి దేవమ్మ, కల్పన, లావణ్య తదితరులు పాల్గొన్నారు.(Story : మహిళా సమస్యల సాధన కోసం కృషి చేయాలి: పిడి ఉమాదేవి)