ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరు ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలి
చింతూరు ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్
న్యూస్‌తెలుగు/చింతూరు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి, ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చింతూరు ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఓటర్లను కోరారు . జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చింతూరు మండల రెవెన్యూ విభాగం, తహసీల్దార్ యస్. చిరంజీవి బాబు ఆధ్వర్యంలో చింతూరు ఐ.టి.డి.ఎ. కార్యాలయం నుండి చింతూరు సెంటర్ వరకు ప్లకార్డులు, నినాదాలతో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు. తొలుత అపూర్వ భరత్ పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి తాను కూడా ర్యాలీలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటి కలెక్టర్ పి.అంబేద్కర్, తహసీల్దార్ చిరంజీవి బాబు, ఆర్ ఐ విఘ్నేష్,మల్లు దొర, రామచంద్ర, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ మీరా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం , అధ్యాపకులు యం.శేఖర్, జి.వెంకటరావు, యన్.యస్.యస్.ఆఫిసర్ జి.సాయికూమార్, యస్.అప్పనమ్మ, ఆర్.సిహెచ్.నాగేశ్వరరావు,యన్.రమేష్,బి.శ్రీనివాసరావు,యన్.వి.వి.యస్.యన్.మూర్తి,.జె.ఎలిజబెత్,బి.అప్పలనాయుడు,కె.గణేశ్, డి.శ్రీనివాసరావు తదితర అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం ఐ.టి.డి.ఎ. సెమినార్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగంపై వక్తలు అవగాహన కల్పించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన,వక్తృత్వం, క్విజ్ పోటీల విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇరువురు సీనియర్ ఓటర్లను ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్ ఘనంగా సన్మానించారు. (Story : ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరు ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలి)