చింతూరు పోలీస్ ల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్
న్యూస్‌తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, ఓ ఎస్ డి జగదీష్ అడహళ్లి, ఏ ఎస్ పి పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో చింతూరు మండలం,లోని పేగ పంచాయతీ అల్లిగూడెం గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం లో భాగంగా మెగా వాలీబాల్ టోర్నమెంట్, మెడికల్ క్యాంప్, ప్రజలతో భోజనం కార్యక్రమాలను శనివారం నిర్వహించారు.
పేగ పంచాయతీ లో గల గ్రామాలలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవటం , వారికి సరైన రవాణా సౌకర్యం లేకపోవుట, మెరుగైన వైద్య సదుపాయం సకాలంలో అందక చాలామంది అనారోగ్యం తో బాధపడుతున్నారని
, సెల్ఫోన్ నెట్వర్క్ లేని ప్రాంతాలు, ముఖ్య గ్రామాలకు అనుసంధానం లేకపోవడo వంటి అసౌకర్యాలతో మెరుగైన జీవన విధానంకు నోచుకోని కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ , వారి కోసం అనేక సౌకర్యాల కల్పనలో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా శనివారం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసారు .ఈ మెడికల్ క్యాంపు లో సుమారు 250 మంది వైద్య పరీక్షలు చేయించుకుని ,వైద్యం పొంది యున్నారు. అదేవిధంగా ఏడుగురాళ్లపల్లి, పేగ మధ్య రోడ్డు పునరుద్ధరణ, చింతూరు నుండి అల్లిగూడెం వరకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం నడుస్తున్నందున, ఈ బస్సు సౌకర్యాన్ని మల్లంపేట వరకు పొడిగించాలన్న కోరికను స్థానిక ప్రజలు కోరారు. అందుకు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా సానుకూలంగా స్పందించి ,వారి కోరిక మేరకు త్వరలోనే ఆ రెండు కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు . అదేవిధంగా మెగా వాలీబాల్ టోర్నమెంట్ నందు 20 టీమ్స్ పాల్గొని ఉన్నతమైన క్రీడా పటిమను ,స్ఫూర్తిని ప్రదర్శించి ,అల్లిగూడెం గ్రామానికి చెందిన టీమ్స్ గెలుపొంది, వారికి నిత్యం ఉపకరించే స్మార్ట్ వాచెస్, కప్పులను బహుకరించారు . పోలీసు శాఖ ఏర్పాటు చేసిన విందు నందు సుమారు 800 మంది విందు స్వీకరించినారు. పేగా పంచాయతీ సర్పంచ్ కార్యక్రమం లో మాట్లాడుతూ పోలీస్, వైద్యుల పరస్పర సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందని కొనియాడినారు. సిఆర్పిఎఫ్ ఏఓపి క్యాంపు ఏర్పాటు చేయడం ద్వారా పేగా పంచాయతీ గ్రామాలలో శాంతిభద్రతలు నెలకొన్నాయని, చింతూరు పోలీసు వారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడినారు.
ఈ కార్యక్రమం లో చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపిఎస్, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండ్ చేతన్ బిఆర్, సిఐ నాగేంద్రప్రసాద్ , చింతూరు పిఎస్ ఎస్ హెచ్ ఓ పి రమేష్, చింతూరు డిప్యూటీ డా. పుల్లయ్య , చింతూరు పిహెచ్సి డాక్టర్. ఎంవి .కోటి రెడ్డి , ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీ డాక్టర్ ప్రసన్న , డా బాల నరసింహుడు , డా. గురుతేజ్ , డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి , డా రాజశేఖర్ రెడ్డి , డా. శశికళ , డా. జోష్ణ , తదితరులు పాల్గొన్నారు. (Story : చింతూరు పోలీస్ ల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్)