30 న పాత వస్తువుల బహిరంగా వేలం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా పోలీసు కార్యాలయంలో వినియోగించిన వివిధ రకాల పాత సామానులు (స్క్రాబ్)ను ఈ నెల 30వ తేదిన బహిరంగవేలం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ తెలిపారు. పాత వస్తువులు పాతజనరేటర్లు, కంప్యూటర్లు, ట్యాబ్ లు, ఐరన్ బీరువాలు, ఐరన్ ర్యాక్ లు, ఐరన్ మంచాలు, ఐరన్ బెంచీలు, ఐరన్ కుర్చీలు, పైబర్ కుర్చీలు, ఉడ్ టేబుళ్లు, పోలీసు పాత టెంట్లు, బ్యాటరీలు వివిధ రకాల (స్క్రాబ్)ను ఈ నెల 30వ తేదిన ఉదయం-11:00 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం అవరణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. ఈ పాత సామానులు గుర్తించి గడువు ముగిసినందున ఈ నెల 30 వ ( గురువారం) తేదిన బహిరంగా వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాత వస్తువులు (స్క్రాబ్) ను జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం ఆవరణంలో ఉంచడం జరిగిందని, వేలంలో పాల్గొనదల్చిన వారు ముందు వేలం వేసే పాత సామానులు చూసుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగిందని,బహిరంగా వేలంలో పాల్గొనదల్చిన వారు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ జిరాక్స్ సమర్పించి బహిరంగ వేలంలో పాల్గొనాలని ఇతర వివరాలకు సాయుద దళ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు ని సంప్రదించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. వివరాలకు ఈ క్రింది నెంబర్లుకు సంప్రదించగలరు. (Story : 30 న పాత వస్తువుల బహిరంగా వేలం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్)