ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం
బాలికలు అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన పీవో
న్యూస్‌తెలుగు/చింతూరు : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవము ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు . ఈ సందర్బంగా పిల్లలకు వ్యాసరచన పోటీ, డ్రాయింగ్ కంపిటేషన్స్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ.అపూర్వ భరత్ విచ్చేసి బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. బాలికలు అందరు చక్కగా చదువుకుని అన్నీ రంగాల్లో రాణించాలని అదేవిధంగా విద్యార్థులు అందరు వారి యెుక్క తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని , క్రమశిక్షణతో జీవించాలని,మార్చి లో జరిగే పదవ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు.వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో ప్రధమ,ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో గెలుపొందిన వారికీ బహుమతులు అందచేశారు.పాఠశాల గణిత,హిందీ, ఆంగ్ల ఉపాధ్యాయులతో పిల్లల యొక్క పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలికలకు ఐటీడీఏ తరపున ప్రత్యేక బహుమతి అందిస్తానని ఈ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. అదేవిధంగా జిల్లా ఉపవైద్యాధికారి . పి.పుల్లయ్య మాట్లాడుతూ చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం అని, రక్తహీనత బారినపడకుండా పిల్లలే వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించేవిద్ధంగా ఉండాలని చెప్పారు.మొదట 25 సంవత్సరాలు ఏ పిల్లలు అయితే కష్టపడతారు వారు లైఫ్ లో పైకి ఎదుగుతారు అని చెప్పియున్నారు. ఒకరికి ఒకరు సపోర్టుగా అంటూ తోటి వారికి సహాయం చేసే విధంగా ఉండాలని పిల్లలకు సూచించారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న మహిళలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని , చదువుతోనే సాధికారత సాధించగలరని, సమాజంలో అసమానతలు తొలగాలి అంటే అందరూ బాలికలు ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా కృషి చేయాలని చెప్పియున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సై రమేష్ బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఎవరు కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫోటోస్ షేర్ చెయ్యకూడదని , సమాజంలో బాలికలు, మహిళలు పైన జరుగుతున్న అటువంటి అన్యాయాలు పైన అందరూ అవగాహన కలిగి ఉండాలని, వాటిని ఎదురించి పోరాడే విధంగా తయారువ్వాలని ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేసారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి మండల రెవెన్యూ అధికారి చిరంజీవి మాట్లాడుతూ బాలికలు ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకూడదని మంచి స్థాయిలో ఉండాలన్నా రు . ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి విజయగౌరి మాట్లాడుతూ బాలికలందరు చదువు పైన శ్రద్ధ చూపించాలని, అత్యున్నత స్థానాల్లో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహా నిర్మూలన చట్టం 2006, న్యూట్రిషన్, పోస్కో చట్టం మొదలగు అంశాలపై బాలికలకు అవగాహన కల్పించాలన్నా రు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలకృష్ణ ,ఉపాధ్యాయ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం )