యాక్షన్ టీం కమాండర్ అరెస్ట్
న్యూస్‌తెలుగు/చింతూరు : అల్లూరి జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధి కల్లేరు గ్రామ శివారు కల్లేరు పంచాయతీ అటవీ ప్రాంతంలో ఏసిఎం క్యాడర్ యాక్షన్ టీం కమాండర్ కొంటా ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీకి చెందిన కొవ్వాసి సోమడ అలియాస్ ముఖేష్ ను చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొవ్వాసి సోముడా అలియాస్ ముఖేష్ 33 సంవత్సరాల గల మావోయిస్టు యాక్షన్ టీం కమాండర్ పట్టుబడ్డారని, ఇతను సుకుమా జిల్లా చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలియజేశారు. ఇతను 14 సంవత్సరాల వయసులో కొంట ఏరియా కమిటీ కమాండర్ అయిన వ్యక్తి మంగుడు ఇతనని పెట్టు రామ ఏసీఎం లొంగిపోయి ఇన్చార్జిగా ఉన్న కొంట ఏరియా కమిటీ అగ్రికల్చర్ టీంలో పార్టీ మెంబర్గా నియమించారని తెలియజేశారు. 2016 వరకు పార్టీ మెంబర్గా కొనసాగాడని తెలిపారు. సెప్టెంబర్ 2016 సంవత్సరంలో మడకం నంద ఆధ్వర్యంలో బోరలంక అటవీ ప్రాంతంలో పది రోజులు పాటు జరిగిన మెరిట్ ట్రైనింగ్ లో పాల్గొన్నారని తెలిపారు. ఇతనపై రెండు నుండి మూడు లక్షల రివార్డు ఉంటుందని తెలిపారు. సోమడా పలు విధ్వంసాలలో పాల్గొన్నారని తెలిపారు. ఆంధ్ర ఒడిస్సా పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న కూంబింగ్ నేపథ్యంలో మందు పాత్ర పేల్చి హతమార్చాలని ఉద్దేశంతో సమడా మావోయిస్టు పార్టీ నాయకులు సానుభూతిపరులు కలిసి వెళుతుండగా కొవ్వాసి సోమడ తన చేతుల్లో ఉన్న క్యానుతో పోలీసులకు పట్టు పడ్డారని తెలియజేశారు. ఆంధ్ర ఒరిస్సా పోలీస్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కుంబింగ్ నేపథ్యంలో ఏరియా డామినేషన్ జరుగుతుందని ఎస్పీ తెలిపారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. (Story : యాక్షన్ టీం కమాండర్ అరెస్ట్)