సాలూరులో లోకేష్ జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు /సాలూరు : తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రజా సేవ చేస్తూ తెలుగువారి అభివృద్ధి కోసం అనునిత్యం కష్టపడుతున్న వ్యక్తి విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ బాబుని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖా మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలో మంత్రి లోకేష్ జన్మదిన సందర్భంగా మంత్రి
క్యాంప్ కార్యాలయం నుండి సాలూరు బ్రిడ్జి వరకు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం
పట్టణంలోగల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా
226 రోజులు యువగళం పాదయాత్రలో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపి దిగ్విజయంగా చేసిన నారా లోకేష్ బాబు కు ప్రతీకగా పుట్టినరోజు సందర్భంగా 226 అడుగులు భారీ ఫ్లెక్సీని సాలూరు బ్రిడ్జి వద్ద ప్రదర్శనగా ఏర్పాటు చేశారు.
సాలూరు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన 226 అడుగుల భారీ ఫ్లెక్సీ వద్ద నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలసి కేక్ కట్ అభిమానులు తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర రాజకీయాలలో మార్క్ సంపాదించిన వ్యక్తి లోకేష్ బాబు అని అన్నారు.
లక్షలాది యువకుల గొంతులా మారిన యువగళం రధ సారధి నారా లోకేష్ బాబు అని అన్నారు.
యువగళం సారథి.. నవశకానికి వారధి,కార్యకర్తల సంక్షేమ పెన్నిధి.. రాష్ట్ర భవితకు అసలైన ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు అని చెప్పారు.
ప్రతి మాట ప్రజల కోసం, ప్రతి అడుగు ప్రజల వైపు. ప్రజా ప్రగతి కోసం ప్రజల నుంచి వచ్చిన ప్రజానాయకుడు అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నాణ్యమైన విలువలతో కూడిన విద్య ను అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించడంలో ఆయన చేసిన సేవలు మనవలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు. మండల అధ్యక్షుడు పరమేశు. తెలుగుదేశం పార్టీ నాయకులు. ముఖి సూర్యనారాయణ. వైకుంఠపు హర్షవర్ధన్. అల్లు అప్పయ్యమ్మ ,వైదేహి, చంద్ర, కొనిశెట్టి బీమా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : సాలూరులో లోకేష్ జన్మదిన వేడుకలు)