త్రాగునీటి బోర్ ఏర్పాటు
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఏ జి హెచ్ ఎస్ లో గత కొంతకాలంగా మంచినీటి బోర్లు మరమ్మత్తులకు గురి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తరచూ విద్యుత్ మోటార్లు బోర్ లో నీరు ఇంకిపోవడంతో విద్యార్థుల కాలకృత్యాలు ఇతర అవసరాలకు మంచినీటి కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని స్థానిక ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించి త్రాగునీటి బోరును గురువారం పాఠశాల కు రిగ్గును వేయించడం జరిగింది. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సుమారు 400 మంది విద్యార్థులు ఉంటున్న ఆశ్రమంలో రెండు బోర్లు ఉన్నా కానీ మొరాయించడంతో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి ప్రతిరోజు గురి అవుతున్నారు. స్వయంగా జమాల్ ఖాన్ హాస్టల్లో ఉన్న త్రాగునీటి సమస్యను పరిశీలించి పాఠశాల సిబ్బందితో చర్చించి స్థానిక ఏ టి డబ్ల్యూ ఓ. సుజాత మరియు సిబ్బందితో మాట్లాడి బోరు అనుమతులను అడిగి తీసుకున్న అనంతరం రిగ్గును ఏర్పాటు చేయడం జరిగింది. తమ హాస్టల్ లో మంచినీటి సమస్యను పరిష్కరించినందుకుగాను పాఠశాల సిబ్బంది విద్యార్థులు జమాల్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పావని, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పి సాల్మన్ రాజు, ముత్యాల శ్రీరామ్, పొదిలి రామారావు, తుర్రం తమ్మయ్య, జీకే సిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.(Story : త్రాగునీటి బోర్ ఏర్పాటు)