డివైడర్లు, గోడలపై పోస్టర్లు అంటించడంపై నిషేధం
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలో ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశాల మేరకు మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ రోజువారీ పర్యటనల్లో భాగంగా బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని డివైడర్లు మరియు గోడలపై సినిమా పోస్టర్లు, మతపరమైన పోస్టర్లు మరియు వ్యాపార ప్రకటనల పోస్టర్లను అతికించకుండా పౌరులకు , వ్యాపార యజమానులకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించడం వల్ల పట్టణం యొక్క విజువల్ అప్పీరెన్స్ మరియు పరిశుభ్రత దెబ్బతింటుందని, ఆకర్షణీయమైన పోస్టర్స్ చూస్తూ వాహనదారుల దృష్టి మరలడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని , గోడలకు అతికించిన పోస్టర్స్ పశువులు తినడం వల్ల పశువులు అనారోగ్యం బారిన పడటం వంటి కారణాల రీత్యా పోస్టర్స్ ని అతికించకుండా మున్సిపాలిటీ గుర్తించిన అధీకృత స్థలంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్థానిక వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో ప్రచారాలను నిర్వహించుకోవాలని చూచించారు. (Story: డివైడర్లు, గోడలపై పోస్టర్లు అంటించడంపై నిషేధం)