ఆరణ్యాన్ని వీడండి ఆదరిస్తాం
– ఎస్పి ఎదుట లొంగిపోయిన 22 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు
– చర్ల పోలీస్ స్టేషన్లో ఆత్మీయ సమ్మేళనం
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం : అరాణ్యాన్ని వీడి జన జీవనంలోనికి వస్తే తప్పకుండా ఆదరిస్తామని, మీ జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు బాధ్యత తీసుకుంటామని ఎస్పి రోహిత్ రాజ్ అన్నారు. శనివారం చర్ల పోలీస్ స్టేషన్లో ఛత్తీస్గ గఢ్ రాష్ట్రం సుక్మాజిల్లా, ఎర్రపల్లి ఆర్పిసికి చెందిన 22 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు ఎస్పి ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో లొంగిపోయి, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ సభ్యుల కుటుంబాలతో ఆత్మీయ నమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పి రోహిత్ రాజ్ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాసాన్ని అందిస్తుందని, ఇందుకు ఆకర్షితులై 22 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారన్నారు. లొంగిపోయిన వారికి వెంటనే పునరావాస ప్యాకేజీని అందించేందుకు కృషి చేస్తామని, గత ఏడాది అజ్ఞాతాన్ని వీడి 36 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారని, మిగిత
వారు కూడా లొంగిపోయి కుంటబాలతో సంతోషంగా గడపాలన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో నివశించే ఆదివాసీ ప్రజలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్య, వైద్యం, రవాణా సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివశిస్తూ చదువుకునే యువత ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తామని, ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న కుల ధృవీకరణ పత్రాల మంజూరీ విషయంలో జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా ప్రయత్నిస్తామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివశించే ప్రజలకు అన్ని రకాల పథకాలు అందేలా చూస్తామని చెప్పారు. అభివృద్ధి నిరోదకులుగా మారిన మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఆత్మీయసమ్మేళనంలో ఏర్పాటు చేసిన సహపంక్తి వింధులో పోలీసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కృషి చేసిన చర్ల, దుమ్ముగూడెం సిబలు రాజువర్మ, అశోక్, ఎస్బ నర్సిరెడ్డిని, పోలీస్ సిబ్బందిని ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. (Story : ఆరణ్యాన్ని వీడండి ఆదరిస్తాం)