అభివృద్ధి, ప్రజాసమస్యల పరిస్కారమే
ప్రధాన ఎజెండా
కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శoగా నిలుపుతా
విమానాశ్రయం, కార్పొరేషన్ కల సాకారం కాబోతోంది
క్రీడాభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నాం
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
రూ.45 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపడమే ప్రధాన ఎజెండాగా చేసుకొని అనునిత్యం శ్రమిస్తున్నానని, అవధులు లేని అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించి కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పునరుద్ఘటించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 27వ వార్డులో పరిధిలోని ప్రగతి మైదానంలో రూ.20లక్షలు, అదేవిధంగా రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న ఎంపవర్మెంట్ సెంటర్ అభివృద్ధి పనులకు శనివారం కూనంనేని శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణాన్ని నగరాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రేత్యేక ద్రుష్టి సారించానని తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వివిధ పథకాల్లో నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలని తావుండబోదని, సమస్యలులేని ప్రతి వార్డు, ప్రతి పంచాయతిగా తెర్చిదిద్ధే వరకు విశ్రమించబోనను స్పష్టం చేశారు. నిర్లక్ష్యానికి గురైన క్రీడారగంపై దృష్టిసారించానని, అందుబాటులో ఉన్న క్రీడామైదానాలను, ఓపెన్ జిమ్ములను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతోపాటు పంచాయతి కేంద్రాల్లో క్రీడాకారులకు కావాల్సిన ఏర్పాట్లు చేసి క్రీడలను, క్రీడాకారులని ప్రోత్సహిస్తానని తెలిపారు. సామాన్యులకు సైతం అందుబాటులో వుండే విధంగాని కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణం, హరిత హోటల్, అభివృద్ధికి బాటలువేసే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తన కల అని వీటిని సాకారం చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, చైర్పర్సన్ సీతాలక్ష్మి, తహసీల్దార్ పుల్లయ్య, శేషాంజన్ స్వామి, డీఈ రవీందర్, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, ధర్మరాజు, విజయ్ కుమార్, రూక్మెందర్ బండారు, అంబుల వేణు, లక్ష్మణ్, నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, యూసుఫ్, నెరేళ్ల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, లింగేష్, జోసెఫ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (Story : అభివృద్ధి, ప్రజాసమస్యల పరిస్కారమే ప్రధాన ఎజెండా)