శ్రీ గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవం
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక బోస్ బొమ్మ సెంటర్ నందు శ్రీ శ్రీ శ్రీ మన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమం ఆవరణలో శ్రీ గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవ్వేత్తంగా కనుల పండగగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయాన్నే మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పట్టణ పురవీధుల నందు పల్లకి సేవ మరియు తిరువీధి నగరోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం కళ్యాణ్ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు కళ్యాణంలో పాల్గొని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మనవడి అన్నప్రాసన సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో అన్నసంతర్పణకు ఒక లక్ష 6 వేల 116 రూపాయలను సమర్పించి సంతర్పణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవీ రమణ నిలయం నిర్వహకులు సనిశెట్టి సీత, కొల్లిపర రాణి, పొత్తూరు లక్ష్మీ కళ్యాణి, ఉప్పల కుమారి, అచ్యుత లక్ష్మి, తాత రమాదేవి, చండీప్రియ మాలిని, ఉషారాణి, సరిశెట్టి వీరాంజనేయులు, ఉప్పల ప్రకాష్, అప్పలరాజు, అచ్యుత మోహనరావు, తదితరులు వేడుకలలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. (Story : శ్రీ గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవం)