విప్లవ గాయకుడు గద్దర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక సురేష్ మహల్ సెంటర్ నందు ఆదివారం రాత్రి జరిగిన విద్యావంతుల వేదిక ప్రారంభ సభ జరిగింది. ఈ సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి కాసిం మాట్లాడుతూ. అంటరానితనం అణిచివేతలపైన మహాకవి గుర్రం జాషువా తన పద్య కవిత్వం ద్వారా సాగించిన పోరాటం ఆయన జీవితాంతం వరకు కొనసాగింది. వెంటనే అప్పటినుండి ప్రజా గాయకుడు గద్దర్ తనదైన శైలిలో జాషువా అందించిన కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో పాట రూపాన్ని ఎంచుకొని తన జీవితం ముగిసే అంతవరకు బాధ్యతగా ప్రజల మధ్యన ఉండి ప్రజా చైతన్యం కోసం దళితుల ఆదివాసీల హక్కుల కోసం తన గొంతును ప్రయోగించార. ప్రస్తుతం ఆ కర్తవ్యాన్ని గద్దర్ అన్న కుమార్తె వెన్నెల గద్దర్, కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నారని ఆయన అన్నారు. గద్దర్ బాటలో ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పని చేస్తానని గద్దరు బిడ్డ వెన్నెల గద్దర్, ఈ సభలో చాటి చెప్పారు. ఈ సభకు స్థానిక న్యాయవాది పిజె. లూకా, కోల. నవజ్యోతి, కూచి. రామాంజనేయులు, అధ్యక్ష వర్గంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ యొక్క ఉద్దేశాన్ని విద్యావంతుల వేదిక నిర్వహించబోయే కర్తవ్యాన్ని సిహెచ్ఎల్ఎన్. మూర్తి, వివరించారు. రిటైర్డ్ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ. సమాజ మార్పు కోసం మన ముందు తరాలు చేసిన త్యాగం వృధా కాదని దాని ఫలితాలు మనం ఇప్పుడు ఆచరణలో అనుభవిస్తున్నామని వారిని స్మరించుకుంటూ ఆ బాటలోని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సమైక్య జాతీయ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ. ఈ త్యాగాలలో పోరాటాలలో మహిళల పాత్ర చాలా విలువైందని చెప్పారు. సావిత్రిబాయి పూలే లాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఉపాధ్యాయ వేడుక దినంగా ఆమె జన్మదినాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో స్థానిక మాజీ శాసనసభ్యులు మక్కెన. మల్లికార్జునరావు, పాల్గొని ఇలాంటి వేదికలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజల సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకలు ముందుకు వస్తాయని అలా జరగటం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి బాటలు పడతాయని ఆయన అన్నారు. సభలో యువ న్యాయవాది విజయ్, సమన్యాయ కర్తగా వ్యవహరించగా ప్రముఖ చిత్రకారులు జస్టిస్ చిత్రించిన అమరుడు బాలవజ్రం చిత్రపటాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. దుబ్బల దాసు (సహజ కవి) టి. జె ప్రసాద్, (ఎడారి కోయిల ) రాసిన సాహిత్య గ్రంథాలను సభలో ఆవిష్కరించారు . సభలో బిక్కి. మంగమ్మ, (బిక్కి రాములు సతీమణి) శాంతి రేఖ, పి. రూబెన్, పగడాల. సుధాకర్ రెడ్డి, నిర్వహణ బాధ్యతలను కొనసాగించగా ఉపాధ్యాయ నాయకులు బి ఏ. సత్తార్, వందన సమర్పణ చేశారు. సభకు ముందు సభ తర్వాత ప్రజా కళా మండలి వారు ఆలపించిన గేయాలు ప్రజలను బహు ఆకర్షించాయి. (Story : విప్లవ గాయకుడు గద్దర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి)