వనపర్తి పట్టణంలో ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 20వ వార్డులో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ ప్రజలకు వనపర్తి పట్టణ ప్రజలకు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ప్రజలందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో 40 మంది మహిళలు పాల్గొనడం జరిగింది 1, వ బహుమతిగా శిరీష గారు 2, వ బహుమతి శ్రావణి గారు 3,వ బహుమతి మన్నెమ్మ గారు గెలుపొందడం జరిగింది గెలుపొందిన ముగ్గురు మహిళలకు వారితోపాటు 37 మంది మహిళలకు ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య గారు మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేయడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 10 లక్షల ఆరోగ్య బీమా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 500 కు గ్యాస్ సిలిండర్ రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ ప్రజలకు చేయడం జరిగింది ఈనెల 26వ తారీకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త రేషన్ కార్డులు గాని కొత్త పెన్షన్లు గాని ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కానీ త్వరలోనే ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు ఏమి చేయలేదు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోలేదు అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలు కచ్చితంగా నెరవేరుస్తాం రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ,వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ మున్సిపల్ కౌన్సిలర్స్ చంద్రకళ ఎల్ఐసి కృష్ణ సుమిత్ర యాదగిరి విభూతి నారాయణ జయసుధ మధు గౌడ్ వినోద్ గౌడ్ తిరుపతి రెడ్డి మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ ఈరపోగు శ్రీనివాసులు గంధం సంగాకర ఈరపోగు అంజి అస్లాం ఫజల్ కేడిఆర్ పజిల్ తదితరులు పాల్గొన్నారు . (Story :వనపర్తి పట్టణంలో ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే)