Homeవార్తలుతెలంగాణమామిడి మాడ కర్ణమోల్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

మామిడి మాడ కర్ణమోల్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

మామిడి మాడ కర్ణమోల్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఖిల్లా ఘణపురం మండలం మామిడిమాడ గ్రామ శివారులోని కర్ణమోల ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి భోగి పండుగను పురస్కరించుకొని ఏళ్ల తరబడి సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఇట్టి పూజా కార్యక్రమానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు హాజరైన ఎమ్మెల్యే స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు
పండగలు మన ఆచార వ్యవహారాలకు ప్రతీకలని ఇలాంటి పండగలను గ్రామస్తులందరూ కలిసి సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రావు, సాయి చరణ్ రెడ్డి, నాయకులు శ్రీరాములు సున్నతి రమేష్, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మానాజి పెట్ మాజీ సర్పంచ్ సతీష్, మణిగిల్ల మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, సల్కెలాపురం తూడి రవీందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : మామిడి మాడ కర్ణమోల్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!