దేశ చరిత్రలో జరగని రుణమాఫీ రాష్ట్రంలో జరిగింది
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ చేసినంత రైతులకు రుణమాఫీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఘనత దక్కుతుందని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో చౌరస్తాలో ఈనెల 26వ తారీకున రైతు భరోసా పథకం అమలు చేయబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు రైతులతో నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుబంధు పేరు చెప్పి రైతులకు రావాల్సిన సబ్సిడీ రాయితీలు యంత్ర పరికరాలును పంట నష్టపరిహారాలు ఇవ్వకుండా వరి చేస్తే రైతులకు ఉరివేసినట్టే అని చెప్పి బీఆర్ఎస్ రైతులకు ఏ ఒక్క ఆమెని కూడా నెరవేర్చకుండా రైతులను పదేళ్ల మోసం చేశారని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రాష్ట్ర బడ్జెట్లో 74 వేల కోట్ల వ్యవసాయ రంగానికి కేటాయించారు. పది నెలల పాలనలోనే 53 వేల కోట్లు రైతుల సంక్షేమానికి ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి దానికి అప్పుకు వడ్డీ కడుతున్నమని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగానే రైతుల భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నామని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 27 రోజులలో 2 లక్షల రూపాయల లోపు రుణాలన్నిటిని దాదాపు 20 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మందికి రైతులకు అకౌంట్లో జమ చేసి రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సన్న వడ్లు తరుగు పేరు మీద రైతులకు మోసం చేశారని మనం ఎక్కడ కూడా మోసం చేయకుండా ఒకటి రెండు రోజుల్లోనే క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ ను రైతుల ఖాతాల్లో వేశామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక వెయ్యి కోట్ల రూపాయలను రైతులకు బోనస్ ను రైతుల అకౌంట్లో జమ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిన్ రెడ్డి, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట రాములు, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు రంజిత్ కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు హరికుమార్ రెడ్డి, కిసాన్ శాల్ పట్టణ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా నాయకుడు మన్యం, కిసాన్ సెల్ నాయకుడు నరేందర్, సురేందర్ గౌడ్, వెంకటేష్ సాగర్, కౌన్సిలర్ అక్కమ్మ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు , కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. (Story : దేశ చరిత్రలో జరగని రుణమాఫీ రాష్ట్రంలో జరిగింది)