ప్రజావాణి దరఖాస్తులనుపరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో. (వై. లకుమయ్య ) : ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి లతొ కలసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజాదర్బార్ కు సంబంధించిన దరఖాస్తులను, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు.
వారం వారం వస్తున్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో
జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం అంశంపై శాఖలు, మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ప్రతి మండలంలో పెండింగ్లో ఉన్న సమస్యలు, వాటికి
గల కారణాలు, పరిష్కరించేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను కలెక్టర్ తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, డిసిఓ సర్దార్ సింగ్, డి ఈ ఓ పాణిని, డి పి ఓ దేవ్ రాజ్, డి డబ్లుఓ శిరీష, డిసి ఎస్ ఓ షా పైజుల్ హుస్సేనీ, డి ఎం డిసి ఎస్ ఓ రాం పతి, డి ఏ ఓ సురేష్ కుమార్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి దరఖాస్తులనుపరిష్కరించాలి)