విశాఖలో ప్రధాని మోది సభకు సర్వం సిద్ధం
ప్రత్తిపాటి పుల్లారావు
న్యూస్‌తెలుగు/చింతూరు : విశాఖలో నేడు జరగనున్న ప్రధాని బహిరంగ సభా నిర్వహణలో భాగంగా స్థానిక నాయకులతో, మంత్రులతో కలిసి మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పర్యవేక్షణ చేశారు. ప్రజల ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడటం జరిగింది. G.V.M.C పరిధిలోని కొన్ని వార్డులు, పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల్లో స్థానిక నాయకులతో కలిసి జన సమీకరణ ఏర్పాట్లు పరిశీలించారు. ప్రధాని హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే (INS- Dega) ప్రాంతాన్ని, బహిరంగ సభ ప్రదేశాన్ని స్థానిక నాయకులు.. N. S. G బలగాలు.. పోలీస్ వారితో కలిసి పరిశీలించడం జరిగింది. సభకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, టెంట్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రత్తిపాటి తెలియజేశారు. (Story : విశాఖలో ప్రధాని మోది సభకు సర్వం సిద్ధం)