UA-35385725-1 UA-35385725-1

సీతం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్మాణంలో ఉన్న భవన సందర్శన

సీతం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్మాణంలో ఉన్న భవన సందర్శన

న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణలో భాగంగా విజయనగరం ఆర్టీఓ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి సంబంధించిన ప్రీ-స్ట్రెస్‌డ్ బీమ్స్, స్లాబ్ నిర్మాణ ప్రక్రియను సందర్శించే అవకాశం కల్పించారు.
ఈ సందర్బంగా, విద్యార్థులకు ప్రీ-స్ట్రెస్‌డ్ స్లాబ్ నిర్మాణ తీరుపై వివరమైన అవగాహన కల్పించడం జరిగింది. భవన నిర్మాణంలో ప్రీ-స్ట్రెస్సింగ్ సాంకేతికత ఉపయోగం, నిర్మాణ ప్రమాణాలు, భవిష్యత్ నిర్మాణ అవసరాలకు సంబంధించిన ప్రక్రియలను సైటులో ఉన్న ఇంజినీర్ ఎ. భాస్కర్ వివరించారు. విద్యార్థులు సైతం సైట్‌లో సాంకేతిక నిపుణులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ ఇలాంటి సైట్ విజిట్లు విద్యార్థుల శిక్షణకు మేలవుతాయని, వారిని నైపుణ్యాలున్న ఇంజినీర్లుగా తీర్చిదిద్దడమే మా కళాశాల లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో సివిల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు, అధ్యక్షులు డా. జి. రవి కిషోర్, అధ్యాపకులు ఎమ్. భార్గవి, కె. గాయత్రి, బి హెచ్ ఎస్. ప్రశాంత్, జి. గౌతం,
పి.శరత్ పాల్గొన్నారు. (Story : సీతం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్మాణంలో ఉన్న భవన సందర్శన)  (Story : సీతం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్మాణంలో ఉన్న భవన సందర్శన)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1