ఆదరణ కోల్పోతున్న ఒగ్గు కళ..ప్రభుత్వం ఆదుకోవాలి
న్యూస్ తెలుగు/ సిద్ధిపేట జిల్లా ప్రతినిధి: ఒగ్గు కథా కళాకారుల ప్రతిభ మహా అద్భుతం. విభిన్న పాత్రలకు జీవం పోస్తూ నిత్యం కళామతల్లి సేవకే అంకితమవుతున్నారు. అయితే వారి దర్పం కేవలం రంగస్థలంపైనే కనబడుతున్నాయి. నటనలో వారిలో కనిపించే దర్పం,ఠీవి నిజజీవితంలో మాత్రం కానరావడం లేదు.ఒకప్పుడు గ్రామాల్లో జరిగే శుభకార్యాలకు, జాతరలకు కళాకారులను ఆహ్వానించి వీరితో ప్రదర్శనలు ఇప్పించేవారు. సుమారు 80-90 వరకు పురాణ గాధలను అనర్గళంగా ప్రదర్శించే కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సహం కరువైందని అక్కన్నపేటకు చెందిన ఒగ్గు కళాకారుడు నకీర్తి పర్శరాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రదర్శనలకు ఆహ్వానించే వారు కరువై కళాకారులు దుర్భరజీవితాన్నీ అనుభవిస్తున్నారు.వృద్ధ కళాకారులకు పింఛన్లు అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఒగ్గు కళాకారులను పట్టించుకోవడం లేదని, ఈ మేరకు ప్రభుత్వ పథకాల్లో తమకు ప్రత్యేక గుర్తింపునిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
( సంపాదకీయం/ సీనియర్ జర్నలిస్ట్ : నారదాసు ఈశ్వర్ )