తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో
నూతన సంవత్సర వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : ఏబీఎం కాంపౌండ్ నందు వినుకొండ నియోజకవర్గ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ సెంటర్ సెంటర్ పార్టీ సండ్ర పాటీ సైదా పాల్గొన్నారు. తాపీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బత్తుల. శ్రీనివాసరావు, సెక్రటరీ మోతాదు, మస్తాన్, ట్రెజరర్ కారుమంచి. మీరావలి, మరో ముఖ్య అతిథి నాయకులు ఎలమంద, వీరిని తాపీ వర్కర్స్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వినుకొండ తాపీ వర్కర్స్ యూనియన్ నియోజకవర్గంలోని మేస్త్రులందరూ కూడా 2024లో ముగించుకొని 2025 లో అడుగు పెడుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని చిన్న మేస్త్రీలు పెద్ద మేస్త్రులు తాపీ వర్కర్స్ సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ దేవున్ని ప్రార్థిస్తున్నానని వారు అన్నారు. అలానే వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ బుజ్జి, (మేస్త్రి )వైస్ ప్రెసిడెంట్ కంద. లక్ష్మీనారాయణ ,మెంబర్లు మస్తాన్. నాగూర్, నాయక్, మరియు తాపీ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొని సన్మానాలు నిర్వహించారు. (Story : తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు)