పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ సమితి
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆదివారం ఉదయం 10 గంటలకు నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గంలోని కార్మికులు రైతు సంఘం వ్యవసాయ కార్మికులు, కూలీలు, ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఆర్టీసీ లైసెన్స్ పోస్టర్స్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ రంగాలలో కష్టపడి పనిచేసే కార్మిక వర్గం వినుకొండ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు సమావేశానికి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. పల్నాడు జిల్లా ప్రజానీకానికి అందరికీ కార్మికులు కర్షకులు రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలు కష్టజీవులకు ఆయన ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గడచిన 2024 సంవత్సరం పోరాటాల సంవత్సరంగా మిగిలిపోయిందని గత రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతు ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై పోరాటాలు నిర్వహించా మన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రభుత్వం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కమ్యూనిస్టు పార్టీ పోరాటాలే మార్గంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. 2025వ సంవత్సరం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మిక వర్గానికి ప్రజలకు రైతాంగానికి కష్టజీవులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, మాజీ పట్టణ కార్యదర్శి పటాన్ లాల్ ఖాన్, ఏఐటీయూసీ నాయకులు బూదాల చిన్న రాయబారం వందనం, ఏరియా కమిటీ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఎ. పవన్ కుమార్, షేక్ మస్తాన్,కె. మల్లికార్జున, సాంబయ్య జల్లి వెంకటేశ్వర్లు, ఎస్.యూనిస్, బూదాల మను, వివిధ రంగాల నుండి వచ్చిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ముఠా యూనియన్, లైసెన్స్ పోటర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మికులు, రాడ్ బెండింగ్ వర్కర్స్, ఆటో వర్కర్స్ యూనియన్, ఎన్ఎస్పి యూనియన్, రైతు సంఘం మహిళా సంఘం విద్యార్థి యువజన సంఘాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు )

