కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ
సంతోషంగా ఉండాలి
న్యూస్ తెలుగు /సాలూరు : కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సాలూరులో ఉన్న ఆమె క్యాంపు కార్యాలయానికి మన్యం జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి ఆమె కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ కొత్త సంవత్సరం ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన్యం ,జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారి వాళ్ళ అబ్బాయి పృద్వి ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నవజీవన్ అనాధా శ్రమం విద్యార్థులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి ఎడిషనల్, ఎస్పీ ఓ దిలీప్ కుమార్,ఏ ఎస్ పి అంకిత సురన, ఐ టి డి ఏ. ఈ ఎన్ సి శ్రీనివాస్ రావు తాసిల్దార్ N V రమణ, ఎండిఓ రమాదేవి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు సాలూరు టౌన్ సిఐ అప్పలనాయుడు, రూరల్ సీఐ రామకృష్ణ, సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు పరమేశు, మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణు, పాచిపెంట మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ బాబు, మెంటాడ మండల పార్టీ అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (Story : కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి)