అభిమానుల తో కోలాహలంగా మారిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర నివాసం
న్యూస్ తెలుగు/ సాలూరు : ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలని,అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని,కోరుకుంటున్నాని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆయన నివాసంలో వైయస్సార్ పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య నూతన సంవత్సర కేకును కట్ చేసి అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సత్ ప్రవర్తన తో ఉండి, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో సామాజిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని ఆ దేవున్ని కోరుకుంటున్నానని అన్నారు. నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలుతెలియజేసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చినందుకు సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైయస్సార్ పార్టీ టౌన్ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సువ్వాడ భరత్ శీను, జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, అనంత కుమారి పాచిపెంట మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు , పాచిపెంట ఎంపీపీ ప్రమీల, సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్. వైయస్సార్ పార్టీ అభిమానులు గిరి రఘు కొల్లి వెంకటరమణ. మధు ,బాలాజీ, రవి, వైయస్సార్ పార్టీ నాలుగు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులు, అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : అభిమానుల తో కోలాహలంగా మారిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర నివాసం )