అమిత్ షా రాజీనామా చేయాలి
న్యూస్‌తెలుగు/చింతూరు : ఇటీవల రాజ్యసభ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ హాజరై మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అమిత్ షా అహంకార పూరిత. అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలన్నారు అంబేద్కర్ కేవలం ఒక సామాజిక వర్గానికి కాదు. యావత్ భారతదేశానికి మహోన్నత వ్యక్తిని కొనియాడారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వాక్యాలు చేయడం చాలా దుర్మార్గమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎన్నికైన పాలకులు ఆ రాజ్యాంగ రూపకర్తలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి పదవి నుండి తొలగించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతిమకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు. సీసం సురేష్. పొడియం లక్ష్మణ్. మొట్టుమ్ రాజయ్య. ఎంపీటీసీ వెక రాజ్ కుమార్ . మాజీ జెడ్పిటిసి మురన్ రంగమ్మ. కారం సుబ్బారావు. కారం నగేష్. మడకం చిన్నయ్య. సవలం కన్నయ్య. పట్రా రమేష్. తెప్పల లక్ష్మయ్య.పల్లపు పెద్ద రాములు. తదితరులు పాల్గొన్నారు (Story : అమిత్ షా రాజీనామా చేయాలి)