మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి
న్యూస్ తెలుగు/ సాలూరు : భారతదేశంలో హార్దిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశం ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తుందంటే దానికి ప్రధాన కారణం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఆయన అస్తమించడం భారతదేశానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడికి రాజన్న దొర అన్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమించడంతో ఆయన చిత్రపటానికి శుక్రవారం సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ ఆఫీస్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేవారని ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణ వలన ఇండియాలో విదేశీయ పెట్టుబడులకు ఆహ్వానం ఆయన హయాయములోనే జరిగింది అని అన్నారు. యూపీఏ 1.2 ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. నిజాయితీగా ఒక నిబద్ధతగా దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు దేశ ప్రజలు మరువలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు అప్పలనాయుడు. రఘు. రామకృష్ణ .సురేష్ .శంకర్రావు. బాలాజీ తదితరులు పాల్గొన్నారు. (Story : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి)