కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్లు జే. అరవింద్, డి.సి.హెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిస్టల వెంకటేశ్వర శర్మ, చెరుకూరి రమేష్, అయూబ్ ఖాన్, గజవల్లి నాగు పవన్ కుమార్, రఫీ, పెనుగొండ శివప్రసాద్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి కస్టమర్స్ కు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తొలత 8 బ్రాంచ్లతో మొదలైన కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతూ 50 బ్రాంచ్ ల వరకు అధిగమించి కస్టమర్లకు మరింత చేరువైందని, ఇందులో భాగంగానే అనేక సేవలందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ వారికి తోడుగా నిలుస్తూ ఉన్న ఈ బ్యాంక్ మరింత బ్రాంచులు దిన దిన అభివృద్ధి చందాలని కస్టమర్లకు మరింత సేవలు అందించాలని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అరవింద్ మాట్లాడుతూ. తమ బ్యాంకులో రాజతోత్సవం పురస్కరించుకొని ఫిక్స్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంక్ తమదే అన్నారు. కార్యక్రమంలో డిసిహెచ్ వెంకటేశ్వర్లు, సయ్యద్ నాగూర్, బి.కలెక్షన్ ఏజెంట్లు కొల్లి హరిబాబు, గౌసియా బేగం ఖాతాదారులు పాల్గొన్నారు. (Story : కోస్టల్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ వేడుకలు)