మాజీ ఎం.పి మంద.జగన్నాథంని
పరామర్శించిన రావుల
న్యూస్‌తెలుగు/వనపర్తి : నాగర్ కర్నూలు మాజీ ఎం.పి డాక్టర్.జగన్నాథం అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు వనపర్తి నియోజకవర్గం రావుల.చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్యం గూర్చి వాకబు చేశారు. కుటుంబసభ్యులు తమ్ముడూ మాజీ ఎం.పి.పివేంకట్ కుమార్,కుమారుడు శ్రీనాథ్ ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. (Story : మాజీ ఎం.పి మంద.జగన్నాథంని పరామర్శించిన రావుల)