క్రిస్మస్ సందర్భంగా పేద పిల్లలకు
నూతన వస్త్రాల పంపిణి
న్యూస్ తెలుగు /వినుకొండ : క్రిస్మస్ సందర్భంగా అభిల్ కలాం థెరిస్సా సేవా సోసైటీ ఆధ్వర్యంలో చందోలు నాగ వాణి చేతుల మీదుగా వెన్నుపూసకాలనీలో బుధవారం 100 విద్యార్తులకు నూతన వస్త్రాల పంపిని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో నాగవాణి మాట్లాడుతు. క్రీస్తు బోధించిన మార్గములో ప్రజలు నడుచుకోవాలన్నారు. దేవుని వాక్యం నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, చెప్తున్నది,అనీ దేవుడు ప్రేమ ఐ ఉన్నాడు అనీ, ప్రేమ,దయ,కలిగి పొరుగువారిని ప్రేమించాలన్నారు. క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. పేదలపట్ల మనము చూపించే ప్రేమ ,అందించే సహాయములో నే నిజమైన క్రిస్మస్ కు సార్థకథ వుంటుందన్నారు. ఈ కార్యక్రమములో పాస్టర్ నల్లబోతుల ఏసురత్నం ,సిస్టర్ రీతా విజన్ (డెన్నిస్,) సిస్టర్ మాణిక్యమ్మ,పూనీటి సంతోషి, పెద్దేటి రాజేంద్ర ప్రసాద్ ,సిస్టర్ పల్లవి,విద్యార్థులు పాల్గొన్నారు. (Story ; క్రిస్మస్ సందర్భంగా పేద పిల్లలకు నూతన వస్త్రాల పంపిణి)

