అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి 100వ జయంతి వేడుకలు స్థానిక భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు, పార్టీ సంస్థ గత ఎన్నికల జిల్లా అధికారి పి.వి కృష్ణారెడ్డి, సహాయ అధికారి వెంగల్ రెడ్డి, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్ల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్, అధ్యక్షుడు ఆడిటర్ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి జయంతి సుపరిపాలన దినంగా భారతదేశమంతా జరుపుతున్నారని, సంస్తాగత ఎన్నికల్లో భాగంగా బూతులు గురించి మార్గదర్శనం చేశారు. అన్ని బూతుల్లో కమిటీలు నియమించి మండల అధ్యక్షులు ఎన్నుకోవాలని మరే రాజకీయ పార్టీలో లేని విధంగా కిందిస్థాయి నుండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని పేర్కొన్నారు. (Story : అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి వేడుకలు)