బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్ లోని ఇమానీయులు తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆవరణలో క్రిస్మస్ పర్వదిన వేడుకల ఉదయం సంఘ కాపరి రేవరెండ్ డాక్టర్ స్పర్జన్ కుమార్ క్రిస్మస్ ఆరాధన దైవ సందేశం పిలుపు వాక్యము ఇచ్చారు . చర్చి సంఘ అధ్యక్షులు చాట్ల రామయ్య శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు చర్చి క్వాయర్ వారు క్రిస్మస్ పాటల ఆలపించారు. కే. ఆశాలత జీవన్ బైబిల్ పట్టణం అందజేశారు ప్రముఖులు ప్రసంగించారు. సంఘ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చాట్ల రామయ్య, సెక్రటరీ గద్దల ఆశి వరప్రసాద్, ట్రెజరర్ పి.సునీల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మోజెస్ నాగస్వామి, వైస్ సెక్రటరీ కూచిపూడి వినోద్ కుమార్, సెక్రెటరీ బేతం మోజేష్, మాజీ ప్రెసిడెంట్ గద్దల ప్రేమనాథ్, ప్రకాష్, కాల్వ సుందర్రావు, మహిళా సెక్రెటరీ కె.ఆశాలత, జీవన్, గద్దల గ్రేస్ మనోహరం, తదితరులు పాల్గొన్నారు. (Story : బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు)