దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి
తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత
న్యూస్ తెలుగు /వినుకొండ : గౌరవనీయులైన వినుకొండ మండలం తాసిల్దార్ కి
సిపిఎం పార్టీ వినుకొండ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పేద ప్రజలు, దివ్యాంగాల పక్షాన తెలియజేయు విన్నపం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో సుందరయ్య నగర్, వికలాంగుల కాలనీ, వెన్నపూస వాగు కాలనీలలో నివాసముంటున్న పేదలు, దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుట గురించి వినుకొండ పట్టణ శివారులోని టిడ్కో గృహనిర్మణ సముదాయం సమీపంలోని సుందరయ్య నగర్ లో గత 20 సంవత్సరాల నుండి 350 కుటుంబలవారు నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సదరు నివాసాలకు అవసరమైన పట్టాలను మంజూరు చేయాలని, వీధిలైట్లను ఏర్పాటు చేయాలని, గృహాలకు కరెంటు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా వెల్లటూరు రోడ్డు లోని వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న 100 కుటుంబల దివ్యాంగులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు వెనపూస వాగు కాలనీలో నివాసం ఉంటున్న 200 మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మంచి మంచినీటి వసతులను కల్పించాలని, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.
గతంలో ఈ సమస్యలపై అనేకసార్లు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, వినతి పత్రాలు అందించడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సులో పై తెలిపిన భూములకు పట్టాలు మంజూరు చేసి సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ మరియు
ఆయా కాలనీల పేద ప్రజలు, దివ్యాంగులు
ఏపూరి గోపాలరావు, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంకూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శి సిపిఎం వినుకొండ కే శివ రామకృష్ణ పాల్గొన్నారు. (Story : దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి)