ఉపాధ్యాయులు మోయలేని జీవో రద్దుచేయాలి
నారా లోకేష్ కి APTF రాష్ట్ర సంఘం వినతి పత్రం
న్యూస్‌తెలుగు/ వినుకొండ :
పాఠశాలల ఉనికికే ప్రశ్నార్థకం చేసిన ఉపాధ్యాయులకు మోయలేని కల్పించినజీవో నెంబర్ 117 మరియు 128 లను రద్దుచేసి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలని*
పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతను అధికమించడానికి పని సర్దుబాటు ద్వారా కాకుండా వెంటనే నెలవారి పదోన్నతులు ఇవ్వాలని పాఠశాలలలో ఇంగ్లీష్ మరియు తెలుగు, ఉర్దూ మీడియాలను కొనసాగించాలని
సీబీఎస్ఈ బోర్డు కు అనుసంధానం చేసిన పాఠశాలలను తిరిగి వెనకకు తీసుకోవాలని ఎన్సీఈఆర్టీ సిలబస్ స్థానంలో తిరిగి స్టేట్ సిలబస్ ను ప్రవేశపెట్టాలని పై సమస్యలను మీ ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి తెలియజేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలరని కోరుతున్నాము. . ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎండి ఉస్మాన్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు , ఉమ్మడి గుంటూరు జిల్లా పూర్వధ్యక్షులు వి చంద్రమౌళి, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి K SK షరీఫా , జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి , మరియు ఐదు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు వినుకొండ జోన్ లోని ఎపిటిఎఫ్ కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. (Story : ఉపాధ్యాయులు మోయలేని జీవో రద్దుచేయాలి)