UA-35385725-1 UA-35385725-1

నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలి

నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలి

– తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

– మార్కెట్ యార్డుల్లో డ్రయర్స్ ఏర్పాటు చేయాలి

– ధాన్యం ఆరపెట్టుకునేందుకు తార్బాలిని పట్టలు ఇవ్వాలి

– ఏప్రిల్ వరకు సాగునీరు సరఫరా చేయాలి

– కేరళ తరహాలో క్వింటా 2800 కొనుగోలు చేయాలి

– రైతు సంఘం నాయకులు డిమాండ్

న్యూస్‌తెలుగు/వినుకొండ: అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు. మంగళవారం వినుకొండ పట్టణంలోని పుతుంబక వెంకటపతి భవన్ లో వారు మాట్లాడుతూ ఏడాది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అల్పపీడనాలతో కురిసిన అకాల వర్షాలకు రైతులు పంటలు నష్టపోయారని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి వరి పంట పూర్తిగా తడిసి నీటి పాలైదని, కోత దశలో ఉన్న వరి, ఓదెల మీద వేసిన వరి పూర్తిగా తడిసిపోయింది అన్నారు. అలాగే మిరప పంట పోతదశలో ఉండి అకాల వర్షానికి పోత రాలిపోయి రైతులు నష్టపోయారన్నారు, మొక్కజొన్న పొగాకు పంటలు అకాల వర్షాలు రైతుకు నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. తడిచిన ధాన్యాన్ని కళ్ళల్లో ఆరబెట్టుకునేందుకు కనీసం తార్బాలిని పట్టలు కూడా ఇవ్వలేదంటే రైతుల పట్ల ప్రభుత్వం ఎటువంటి వైఖరితో వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. ధాన్యాన్ని కళ్ళల్లో ఆరపెట్టుకుందామంటే బట్టలు కూడా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తడిచిన ధాన్యాన్ని మార్కెట్ యార్డుల్లో ఆరపెట్టుకునేందుకు వెళితే అక్కడ డ్రైయర్స్ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. ఈపూరు మార్కెట్ యార్డులో డ్రైవర్ మరమ్మత్తులకు నోచుకోక నిరుపయోగంగా ఉందన్నారు. వినుకొండ మార్కెట్ యార్డులో డ్రయర్ లేకపోవడం బాధాకరమన్నారు. తడిచి రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్సీఐ నిబంధనలు సవరించి ప్రతి గింజ కొనుగోలు చేయాలన్నారు. కేరళ రాష్ట్రంలో వెంట ధాన్యానికి 800 రూపాయలు బోనస్ ప్రకటించి, వెంట 2800 కొనుగోలు చేస్తుందని, ఆ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వింటారు 2,800కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 17% తేమ శాతాన్ని తగ్గించి ధాన్యం కొనుగోలు చేసే రైతును ఆదుకోవాలన్నారు. వినుకొండ ప్రాంతానికి జీవనాడైనా వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణం పనులను వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఎన్నికల ముందు మాట్లాడిన నేతలు ఆచరణలో లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించిన అటవీ శాఖకు 14 కోట్లు చెల్లించలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే పల్నాడు ప్రాంత రైతాంగం పట్ల పాలకులకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తెచ్చానని ఆర్భాటపు ప్రచారం చేసుకునే నాయకుడు కేవలం 14 కోట్లు అటవీ శాఖకు ప్రభుత్వం నుండి చెల్లించి అటవీ అనుమతులు పొందలేకపోవటం, రాష్ట్ర బడ్జెట్లో వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయింపు చేయించక పోవడాన్ని చూస్తుంటే వారి అసమర్ధతకు, ఆర్భాటపు ప్రచారానికి నిదర్శనం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోతే రాజకీయ సన్యాసం చేస్తామన్న నేతలు ముందుకు వచ్చి ప్రభుత్వం చేత నిధులు కేటాయింపు చేసి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు రాజా, కంతేటి శివరామకృష్ణ, ముని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1